కలం, వెబ్ డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ఓయో హోటళ్లు (OYO Hotels) నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నాయి. పోలీసులు రెగ్యులర్‌గా తనిఖీలు చేస్తున్నా, హోటళ్ల నిర్వాహకుల తీరు మారడం లేదు. అసాంఘిక కార్యక్రమాలు, చట్ట విరుద్దమైన కార్యాకలాపాలు జరుగుతున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు కూకట్‌పల్లి పరిధిలోని పలు ఓయో హోటళ్లపై దాడులు నిర్వహించారు.
ఆగస్టు 18న పోలీసులు అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్‌లోని రెండు OYO హోటళ్లలో తనిఖీలు చేశారు. 12 మందిని గుర్తించి, 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో అబ్బాయితోపాటు అమ్మాయిలున్నారు. 7 స్మార్ట్‌ఫోన్లు, 6 కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హోటల్ యజమాని పరారయ్యాడు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. కొంతమంది ముఠా విదేశీ, ఢిల్లీ నుంచి అమ్మాయిలను హైదరాబాద్‌కు రప్పించి, వారితో వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం అందుతుండటంతో పోలీసులు తరచుగా ఓయో హోటళ్లపై దాడులు చేస్తున్నారు.
OYO హోటళ్లపై దాడులు.. గుట్టురట్టు
– హైదరాబాద్ KPHB పరిధిలో అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్‌లో పోలీసులు రైడ్స్
-OYO హోటళ్లలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు!
-11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-7 స్మార్ట్‌ఫోన్లు, 6 కండోమ్‌లను స్వాధీనం
Kukatpally Police Raid OYO Hotels#Kukatpally… pic.twitter.com/QM0wKd6cum— Kalam Daily (@kalamtelugu) August 21, 2026

