కలం, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అమెరికా పర్యటన రద్దు అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంది. రాజకీయ కోణంలో అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకుందని సీఎం రేవంత్ రెడ్డితో సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణకు అత్యుత్తమ విద్యాసంస్థలను తీసుకువచ్చేందుకు దోహదపడే అమెరికా పర్యటనను కేంద్రం ఉద్దేశం పూర్వకంగానే రద్దు చేసిందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు అంశంపై కేంద్ర విదేశాంగశాఖ స్పష్టతనిచ్చింది.
ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అమెరికా పర్యటనపై కేంద్ర విదేశాంగశాఖ స్పందించింది. సీఎం హోదాకు తగినట్లుగా రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన లేదని తెలిపింది. పర్యటన ఉద్దేశంలో కూడా స్పష్టత లేదని వ్యాఖ్యానించింది. అందుకే అమెరికా పర్యటనను రద్దు చేసినట్లు తెలిపింది. అయితే బ్రిటన్ పర్యటనకు మాత్రం అనుమతి ఇచ్చామని పేర్కొంది.
Also Read : తెలంగాణలో ఆగస్ట్ సంక్షోభం.. కాంగ్రెస్లో ఇన్నర్ ఫైట్!
Follow Us On : WhatsApp

