మల్యాల మండల బీజేపీ కార్మిక విభాగం నూతన కమిటీ నియామకం

కలం, జగిత్యాల : కార్మికులను సంఘాటీతం చేస్తూ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తానని బీజేపీ కార్మిక విభాగం జగిత్యాల జిల్లా కన్వీనర్ కట్ట విజయ్ కుమార్ అన్నారు . భారతీయ జనతా పార్టీ, కార్మిక విభాగం ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మల్యాల (BJP Mallial) మండల కేంద్రంలో శనివారం జరిగిన సమావేశంలో అధ్యక్షులు గాజుల మల్లేశం ఆధ్వర్యంలో బీజేపీ మల్యాల మండల కన్వీనర్‌గా గంగిశెట్టి రాజేశం ను నియమించామని విజయ్ కుమార్ తెలిపారు. రామన్నపేట గ్రామ కన్వీనర్‌గా కోరేపు మల్లేశం, మద్దతుల గ్రామ కన్వీనర్‌గా బొమ్మల సురేష్, రాంపురం గ్రామ కన్వీనర్‌గా ఎద్మలపల్లి హరీష్, గొల్లపల్లి గ్రామ కన్వీనర్‌గా గడ్డం మల్లేశం నియమించినట్లు కట్టా విజయ్ కుమార్, కో-కన్వీనర్ బండారి ప్రభాకర్ లు పేర్కొన్నారు. మండల, గ్రామ కన్వీనర్లు గ్రామాల్లోని బీడీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, ఉపాధి హామీ కూలీలను సంఘటితం చేస్తూ పార్టీని బలోపేతం చేయాలని వారు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>