కలం వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad)లో చైనీస్ మాంజా(Chinese Manja)పై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్(Sajjanar)వెల్లడించారు. జనవరి 8 నుంచి 11వ తేదీ వరకు నాలుగు రోజుల్లోనే రూ.43 లక్షల విలువైన 2,150 బాబిన్లను హైదరాబాద్ పోలీసులు సీజ్(Seize) చేసినట్లు తెలిపారు. చైనీస్ మాంజాతో పర్యావరణానికి, పక్షులకు, మనుషుల ప్రాణాలకు ముప్పు కలుగుతుందని చెప్పారు. ఈ నిషేధిత మాంజాను విక్రయిస్తున్న వ్యవహారంలో 29 కేసులు నమోదు చేసి, 57 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గత నెల రోజుల్లో నమోదైన 132 కేసుల్లో రూ.1.68 కోట్ల విలువైన 8,376 బాబిన్లను స్వాధీనం చేసుకొని, మొత్తంగా 200 మందిని అరెస్ట్ చేశామన్నారు. నిషేధిత మాంజాను విక్రయించినా, కొనుగోలు చేసినా జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. సురక్షితమైన దారాలను వాడుతూ, ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.


