Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే.. మున్సిప‌ల్‌ కార్మికుల ధ‌ర్నా

క‌లం, వెబ్ డెస్క్‌: త‌మ‌పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని స్వ‌చ్ఛ‌ ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. లేదంటే స‌మ్మె చేసేందుకైనా వెనుకాడ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో సీఎం మాట్లాడుతూ 5000 ఆటోలు కొనిస్తే మున్సిప‌ల్ కార్మికులు చెత్త తీసుకుపోవ‌డం లేద‌ని, అందుకే హైద‌రాబాద్‌లో చెత్త పేరుకుపోతోంద‌ని కామెంట్ చేశారు. దీనిపై మున్సిప‌ల్ కార్మికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మంగ‌ళ‌వారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని హెచ్ఎంటీ డంపింగ్ యార్డు వద్ద ఆటోలతో ధర్నాకు దిగారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఒక్క ఆటో కూడా ఇవ్వ‌లేద‌ని కార్మికులు తెలిపారు. గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన స్వచ్ఛ‌ ఆటోలతోనే చెత్త సేకరణ చేస్తున్న‌ట్లు తెలిపారు. విధి నిర్వ‌హ‌ణ‌లో కార్మికులు చ‌నిపోతుంటే, ఉదయాన్నే ఐదు గంటల నుంచి చెత్త సేకరిస్తున్న తమపై సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ప్ర‌శ్నించారు. స్వచ్ఛ ఆటోలకు జీహెచ్ఎంసీ (GHMC) కనీసం నెలవారీ ఈఎంఐలు కూడా చెల్లించడం లేదని మున్సిపల్ కార్మికులు మండిప‌డ్డారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బహిరంగ క్షమాపణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Read Also: యూసీసీ అమలుకు టైమ్​ వచ్చింది : సుప్రీంకోర్టు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>