కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అడుగులు వేస్తోంది. నగరంలోని 24 నియోజకవర్గాల్లో తక్కువ ఆదాయ వర్గాల కోసం ఒకేసారి లక్ష ఇళ్ల నిర్మాణానికి (Hyderabad LIG) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బుధవారం నాడు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక పర్యటనలు చేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మంత్రి మహ్మద్ అజారుద్దీన్ లతో కలిసి నాంపల్లి, మలక్‌పేట్, బహదూర్‌పురా నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాలను స్వయంగా పరిశీలించారు.
కుల్సుంపురా, అఫ్జల్ సాగర్ ప్రాంతాలతో పాటు కాలదేరా, గడ్డిఅన్నారంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ భవనాలు, ఖాళీ స్థలాలను ఈ బృందం క్షుణ్ణంగా తనిఖీ చేసింది. తొలి విడతలోనే లక్ష ఇళ్లను నిర్మించి అర్హులైన పేదలకు అందించాలనేది ప్రభుత్వ దృఢ సంకల్పమని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నగరంలో ఇళ్ల లేని పేద కుటుంబాలకు ఈ ప్రాజెక్ట్ ఒక గొప్ప వరంగా మారబోతోంది.
Read Also: మైహోమ్ సంస్థకు హైడ్రా షాక్ : 1800 కోట్ల కబ్జా భూమి స్వాధీనం!
Follow Us On: Sharechat

