Mobile Popup Ad
Mobile Popup Ad

రోగులకు మత్తుమందు ఇస్తూ.. బంగారం దోచేస్తున్న నకిలీ నర్సు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ (Hyderabad)లో నర్సు వేషంలో వచ్చి రోగులకు మత్తు మందుఇచ్చి, బంగారు ఆభరణాలను దొంగిలిస్తున్న మహిళ, ఆమెకు సహకరించిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలిని గౌండ్ల శిరీష (25)గా, ఆమె భర్తను ఎదులపల్లి సాయి కుమార్ గౌడ్ (30)గా గుర్తించారు. శిరీష ఆసుపత్రుల్లోకి నర్సులా మారువేషంలో ప్రవేశించి ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకునేది. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి, ఆపై వారి ఒంటిపై ఉన్న బంగారు నగలతో పరారయ్యేది.

సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి, చందానగర్‌లోని సిటిజన్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి సుమారు 11 తులాల బంగారు ఆభరణాలు, ఒక కారు, రెండు మొబైల్ ఫోన్లను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్, స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నగరంలోని ఆస్పత్రుల్లో భద్రతా లోపాలు, రోగుల (Patients) సహాయకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>