అమెరికా-ఇరాన్ వార్ : మిత్రదేశాలపై ట్రంప్ ఫైర్

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధానికి దిగే ప్రయత్నాలను మిత్రదేశాలు వ్యతిరేకించడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా నాటో (NATO) దేశాలపై తీవ్ర విమర్శలు చేశారు. నాటో మిత్రదేశాలు సైనిక చర్యలో పాల్గొనదల్చుకోవడం లేదని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు. అదే సమయంలో అమెరికాకు వారి సాయం అవసరం లేదని స్పష్టం చేశారు. NATO తీరు పట్ల తాను నిరాశ చెందను అని ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు.

ఆ కూటమి నిర్ణయం మూర్ఖపు పొరపాటుగా ట్రంప్ వ్యాఖ్యానించారు. నాటో ఎప్పుడు వన్ వే ట్రాఫిక్ లాంటిదేనని. తాము వారిని కాపాడతాం కానీ, నాటో మాత్రం సాయం చేయదన్నారు. అయితే, ఈ దేశాల కోసం అమెరికా వందల బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇరాన్ విషయంలో అమెరికా సైనిక విజయం సాధించిందని తమకు నాటో అవసరం లేదన్నారు. అలాగే, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా విషయంలో కూడా ఇంతేనని తేల్చిచెప్పారు. ఇకపై తమకు ఎవరి సహాయం అవసరం లేదని అమెరికా ఒంటరిగానే ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ధీమా వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>