నిజామాబాద్‌లో టెన్షన్ టెన్షన్.. ఏం జరిగిందంటే!

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) నగరంలో చెత్త స్థానికులను టెన్షన్ పెట్టింది. నిజామాబాద్ కసాబ్ గల్లీలో రోడ్డు పక్కన ఉన్న చెత్తకు ఎవరో నిప్పు పెట్టారు. ఖాళీ స్థలంలో ఉన్న ఆ చెత్తకు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు, వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ఊపిరి పీల్చలేక ఇబ్బందులు పడ్డారు. స్థానికులు.. పోలీసులు, ఫైరింజన్‌కు సమాచారం అందించారు. ఫైరింజన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు (Fire) ఆర్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చివరకు మంటలు అదుపులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>