బాలుడిపై లైంగిక దాడి.. ఆటో డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు

కలం, క్రైమ్ బ్యూరో : హైదరాబాద్‎ (Hyderabad) లో 11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఆటో డ్రైవర్‎కు ప్రత్యేక సెషన్స్ కోర్టు 20 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే , 2019 అక్టోబర్ 29న 11 ఏళ్ల బాలుడు రాణిగంజ్ వెళ్లేందుకు జలవిహార్ సమీపంలో ఆటో ఎక్కాడు. ఆటో డ్రైవర్ అబ్దుల్ రహమాన్ ఆటోను దారి మళ్లించి, బతుకమ్మకుంట సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన ఉన్న పొదల్లోకి బాలుడిని బలవంతంగా లాగి తీసుకొని వెళ్లాడు. అక్కడ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడు ప్రతిఘటించడంతో, అబ్దుల్ రహమాన్ బాలుడి తలను గోడకు గట్టిగా బాదాడు. దీంతో బాలుడి తలకు తీవ్ర రక్తస్రావమైంది.

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితుడు అబ్దుల్ రహమన్‎ను అదుపులోకి తీసుకున్నారు. రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ హాకా భవన్ లోని పోక్సో చట్టం ప్రత్యేక సెషన్స్ జడ్జి కోర్టులో సోమవారం ఈ కేసు విచారణ జరిగింది. న్యాయమూర్తి జి.ఉదయ్ భాస్కర్ రావు నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 6 వేల జరిమానా విధించారు. నిందితునికి కఠిన శిక్ష పడేలా పక్కా ఆధారాలు సేకరించి, నిరంతరం పర్యవేక్షించిన పోలీస్ బృందాన్ని సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>