డంపింగ్ యార్డ్ రద్దుపై ప్రకటన చేయాలి : బీజేపీ జిల్లా అధ్యక్షుడు

కలం, కరీంనగర్ బ్యూరో : హుజూరాబాద్ రూరల్ మండలం సిర్సపల్లి శివారులో డంపింగ్ యార్డు (Huzurabad Dumping Yard Issue) ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, వెంటనే డంపింగ్ యార్డ్ రద్దు చేస్తున్నామనే ప్రకటన చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ రద్దు కోసం జేఏసీ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా జరుగుతున్న ఆందోళన, నిరసన కార్యక్రమాలలో భాగంగా స్థానిక గ్రామాల ప్రజలు డంపింగ్ యార్డ్ భారీ నుండి మమ్మల్ని కాపాడాలని భగవంతుని వేడుకుంటూ ఐయినవోలు మల్లన్న పట్నాలు వేశారు. మల్లన్న పట్నాలు వేసిన సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెల రోజులుగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు వద్దని ప్రజలు రోడ్డెక్కి మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదన్నారు. డంపింగ్ యార్డ్ రద్దు కోసం జేఏసీ ఆధ్వర్యంలో ప్రతిరోజు అనేక ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా, రద్దు చేసేలా ప్రకటన చేయాలని ప్రజలంతా మూకుమ్మడిగా దేవుని వేడుకుంటూ పట్నాలు వేసే దయనీయ పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ప్రశాంతంగా ఉన్న హుజూరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకువచ్చి అశాంతి, అలజడిని సృష్టించిందని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని మార్చుకొని, డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఆ దిశగా వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డంపింగ్ యార్డ్ రద్దు ప్రకటన చేయాలని గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జేఏసీ నాయకులు, బీజేపీ మండల పట్టణ అధ్యక్షులు పారుపల్లి కొండాల్ రెడ్డి, తూర్పాటి రాజు, కౌన్సిలర్ పంజాల మనోజ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, మాజీ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, నాయకులు పైళ్ల వెంకట్ రెడ్డి, యాంసాని శశిధర్ తదితరులున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>