కలం, కరీంనగర్ బ్యూరో: వీణవంక, జమ్మికుంట మండలాల రైతులకు సాగునీరు అందించే కల్వల ప్రాజెక్ట్ పనులను (Kalvala Irrigation Project) వెంటనే పూర్తి చేయాలని హుజూరాబాద్ (Huzurabad) కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కోరారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందించారు. అలాగే గుంపుల-శంభునిపల్లి గ్రామాల పరిధిలోని తనుగుల చెక్ డ్యాంను కూడా త్వరితగతిన పునరుద్ధరణ చేయాలని కోరారు. రైతులకు సాగు నీటి విషయంలో ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
Read Also: రూ. 94 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి సాధ్యమేనా?: కేటీఆర్
Follow Us On: Instagram

