హుస్నాబాద్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్!

కలం, వెబ్ డెస్క్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ (Husnabad) పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. హనుమకొండ రోడ్డులోని కళ్యాణమస్తు షాపింగ్ మాల్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న మున్సిపల్ చెత్త సేకరణ ట్రాక్టర్‌ను బైకు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బైక్‌పై ముగ్గురు ప్రయాణిస్తున్నారు. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వ్యక్తిని చికిత్స నిమత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను హుస్నాబాద్‌‌కు చెందిన శ్రీకాంత్, నరసింహలుగా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్‌‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>