లారీ కిందికి దూసుకెళ్లిన కారు.. ఇద్ద‌రు మృతి

క‌లం, వెబ్ డెస్క్‌: శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఓ కారు అతివేగంతో లారీని ఢీకొట్ట‌డంతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని నందిగాంలో ఆదివారం ఉదయం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కారు అతివేగంగా వ‌చ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్ట‌డంతో ప్ర‌మాదం జ‌రిగింది. ఆ స‌మయంలో కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు గాయాల పాల‌య్యారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతి చెందిన ఇద్ద‌రిని, మోహిన‌మ్మ‌, దాల‌య్య‌గా గుర్తించారు. వీరంతా ఒడిశాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Read Also: పగలు సాఫ్ట్‌వేర్.. రాత్రి గజదొంగ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>