భార్య వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య

కలం, వరంగల్ బ్యూరో : భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్ని సార్లు చెప్పినా భార్య వినకపోవడంతో.. చివరకు తన ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ (Mahabubabad)  జిల్లా సిరోలు మండలం అంధనాలపాడు గ్రామ పరిధిలోని శీత్లాతండాలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ధరంసోత్ సురేష్ కు ఏడాది క్రితం అనితతో వివాహం జరిగింది. అనితకు ఇంటి ఎదురుగా నివసిస్తున్న సాయితో వివాహేతర సంబంధం ఉందని.. దీనిపై పలుమార్లు పెద్ద మనుషుల మధ్య పంచాయితీ కూడా చేశారు. భార్య ప్రవర్తన మారకపోవడంతో.. మనస్థాపానికి గురై సురేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి శ్రీను ఆరోపించారు. సురేష్ ఆత్మహత్యకు అదేతండాకు చెందిన సాయి కారణమంటూ అతడి ఇంటిముందు మృతదేహంతో కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు తండాకు చేరుకున్నారు. మృతుడి తండ్రి శ్రీను ఆరోపించారు. తన కుమారుడి మరణానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Read Also: సీఎం వర్సెస్ సివిల్ సర్వెంట్స్.. ఆగ్రహం, అనుగ్రహం ఎవరిపై?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>