epaper
Monday, March 2, 2026
epaper

ఈపీఎఫ్​ లబ్ధిదారులకు నిరాశ.. పెరగని వడ్డీ రేటు

కలం, వెబ్​ డెస్క్​: ఎంప్లాయీస్​ ప్రావిడెంట్​ ఫండ్​ ఆర్గనైజేషన్​ (EPFO) వరుసగా మూడో ఆర్థిక సంవత్సరంలోనూ వడ్డీ రేటును యథాతథంగా ఉంచింది. 2025–26కు గాను ఉద్యోగుల భవిష్య నిధి వడ్డీ రేటును 8.25శాతంగా నిర్ణయిస్తూ కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కేంద్ర మంత్రి మన్​సుఖ్​ మాండవీయ నేతృత్వంలో సోమవారం జరిగిన సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ ట్రస్ట్రీస్​(CBT) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2022–23లో వడ్డీ రేటు 8.15శాతానికి పెరగ్గా, ఆ తర్వాత 2023–24లో 8.25కు పెంచారు. అప్పటి నుంచి వరుసగా మూడో ఆర్థిక సంవత్సరంలోనూ వడ్డీ రేటులో మార్పు లేదు. ఉద్యోగుల పెన్షన్​పై ఇచ్చే ఈ వడ్డీరేటు పెంచకపోవడంతో ఈపీఎఫ్​ లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు.

కాగా, వడ్డీ రేటుపై సీబీటీ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చాక, ఈపీఎఫ్​కు(EPFO) వడ్డీ జమ అవుతుంది. ప్రస్తుతం ఈపీఎఫ్​లో 7కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. మరోవైపు బ్యాంకుల్లో ఎవరికీ చెందకుండా ఉన్న ఖాతాల్లోని సొమ్ము (అన్​క్లెయిమ్డ్​ డిపాజిట్ల)పైనా కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.1,000 కంటే తక్కువ సొమ్ము ఉన్న లక్షకు పైగా ఖాతాల్లోని రూ.5.89 కోట్లను సెటిల్ చేయనున్నారు. ఈ అన్​క్లెయిమ్డ్​ ఖాతాల సొమ్ము గురించి ఇప్పటికే ప్రభుత్వం, ప్రధాని మోదీ పలుసార్లు ప్రజలకు అవగాహన కల్పించిన విషయం తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!