కలం డెస్క్ : ‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు’ అనేదానికి ప్రత్యక్ష నిదర్శనం బిహార్ లో జరిగిన ఈ సంఘటన! పక్కన ఓ మనిషి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే.. అతడ్ని పట్టించుకోకపోగా, అతడి పక్కన పడి ఉన్న చేపల కోసం ఎగబడ్డారు జనం!! బిహార్ (Bihar) లోని సీతామర్హి ఏరియాలో ఓ చేపల ట్రక్కు ఢీకొని యువకుడు రోడ్డుపై పడిపోయాడు. ట్రక్కు బోల్తా పడటంతో చేపలన్నీ రోడ్డుపై చెల్లాచెదరుగా పడిపోయాయి. అక్కడి జనం అందినకాడికి ఆ చేపలను (Crowd Loots Fish) ఎత్తుకుపోయేందుకు ఎగబడ్డారు. కానీ, పక్కనే రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న యువకుడ్ని మాత్రం పట్టించుకోలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కాగా, ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
బిహార్ లో ఓ మనిషి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే.. అతడ్ని పట్టించుకోకపోగా, అతడి పక్కన పడి ఉన్న చేపల కోసం ఎగబడ్డారు జనం!!
Humanity Shamed: Crowd Loots Fish While Teenager Lies Dead After Tragic Accident in Bihar#Bihar #Sitamarhi #HumanityShamed #Kalam #Kalamdaily #kalamtelugu pic.twitter.com/W15ajK7jpX— Kalam Daily (@kalamtelugu) January 16, 2026
Read Also: దాయాదులు ఒక్కటైనా.. దక్కని ఫలితం!
Follow Us On : WhatsApp


