ఫ్యాన్సీ నెంబర్ ఖరీదు రూ. 1.17 కోట్లు

దేశంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాన్సీ కార్ నంబర్(Costliest Car Number) – HR88B8888 దీని ధర రూ. 1.17 కోట్లు. హర్యానాలో ఫ్యాన్సీ నెంబర్ల కోసం ఈ వారం జరిగిన ఆన్‌లైన్ వేలంలో HR88B8888 నంబర్ రికార్డు స్థాయిలో రూ. 1.17 కోట్లు పలికింది. ఇది ఇప్పటివరకు భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్ రిజిస్ట్రేషన్ నంబర్‌గా నిలిచింది. హర్యానా ప్రభుత్వం ప్రతి వారం fancy.parivahan.gov.in పోర్టల్‌ ద్వారా వీఐపీ నంబర్లకు ఆన్‌లైన్ వేలం నిర్వహిస్తుంది. ఆ ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి సోమవారం ఉదయం 9 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించింది. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఫలితాలను వెల్లడించింది.

HR88B8888 నంబర్ ప్లేట్ క్రేజీ :

ఈ వారం ఫ్యాన్సీ నెంబర్ కోసం అత్యధికంగా 45 దరఖాస్తులు వచ్చాయి. పై నెంబర్ కోసం బేస్ ధరను హర్యానా రవాణా శాఖ రూ. 50,000గా నిర్ణయించింది. ఒకరికంటే ఎక్కువ మంది ఈ నెంబర్ కోసం పోటీ పడడంతో వేలం నిర్వహించడం అనివార్యమైంది. బేస్ ధరతో ప్రారంభమైన వేలం మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఆ నెంబర్ ధర రూ. 88 లక్షలకు చేరింది. చివరికి సాయంత్రం 5 గంటలకు రూ. 1.17 కోట్ల వద్ద స్థిరపడి ఫైనల్ అయింది. నెంబర్‌లో మధ్యలో B అనే అక్షరం కూడా ఆంగ్లంలో కాపిటల్ లెటర్స్ లో రాయాల్సి ఉంటుంది. 8 అంకెల మధ్యలో B అనే ఇంగ్లీషు అక్షరం ‘B’ కూడా 8 లాగానే కనిపిస్తుండడంతో మొత్తం అంకెలన్నీ 8 అనే భావన కలుగుతుంది. షందుకోసమే ఈ నెంబర్ కోసం పోటీ పడినట్లు రవాణా శాఖ కార్యాలయంలో టాక్.

గత వారం HR22W2222 నంబర్ ధర రూ. 37.91 లక్షలు పలికింది.
కేరళ లో ఈ ఏడాది ఏప్రిల్‌లో టెక్ కంపెనీకి చెందిన బిలియనీర్ వేణు గోపాలకృష్ణన్ తన లాంబొర్గినీ విదేశీ కారు నెంబర్ కోసం (KL 07 DG 0007) రూ. 45.99 లక్షలు వెచ్చించారు.

Read Also: ‘టీ20 వరల్డ్ ఫైనల్స్ స్టేడియం సెలక్షన్‌లో పాలిటిక్స్’

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>