పెట్రోల్‌, డీజిల్, ఎల్పీజీ స‌ర‌ఫ‌రాపై హెచ్‌పీసీఎల్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

క‌లం, వెబ్ డెస్క్‌: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ (LPG) సరఫరాలో ఎటువంటి కొరత లేదని, ఇంధన నిల్వలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న నిరాధారమైన వదంతులను నమ్మవద్దని, ఆందోళనతో అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ నెట్‌వర్క్ ద్వారా ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం ఇంధన సరఫరాను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. కావున ప్రజలు ఎప్పటిలాగే తమ సాధారణ అవసరాలకు అనుగుణంగానే ఇంధనాన్ని తీసుకోవాలని హెచ్‌పీసీఎల్ యాజమాన్యం సూచించింది.

Read Also: పవన్ సినిమాల్లో నటించొద్ద‌ని పిటిషన్.. హైకోర్ట్ కీల‌క తీర్పు!

Follow Us On : WhatsApp

 

 

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>