తెలంగాణ అసెంబ్లీ వ‌ద్ద హై టెన్ష‌న్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) వ‌ద్ద ఒక్క‌సారిగా ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్పండింది. స్టూడెంట్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా (SFI) ఆధ్వ‌ర్యంలో విద్యార్థి నాయ‌కులు అసెంబ్లీ ముట్ట‌డికి య‌త్నించారు. ఒక్క‌సారిగా అసెంబ్లీ వైపు దూసుకురావ‌డంతో పోలీసులు వారిని అదుపు చేయ‌లేక‌పోయారు. ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ బ‌కాయిలు విడుద‌ల చేయాల‌ని, పెండింగ్ స్కాల‌ర్‌షిప్‌ల‌కు నిధులు కేటాయించాల‌ని ఎస్ఎఫ్ఐ కార్య‌ర్త‌లు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యా రంగంలో ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, ప్ర‌భుత్వం వాటిపై తీవ్ర నిర్ల‌క్ష్య ధోర‌ణి అవ‌లంబిస్తోంద‌ని వారు ఆరోపించారు. పోలీసులు ఎస్ఎఫ్ఐ కార్య‌క‌ర్త‌ల‌ను అదుపులోకి తీసుకొని, పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఎస్ఎఫ్ఐ ఆందోళ‌న‌తో అసెంబ్లీ ఎదుట‌ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. రోడ్డుపై కార్య‌క‌ర్త‌లు, పోలీసుల ప‌రుగుల‌తో వాహ‌న‌దారులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. కొద్దిసేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>