పవన్ సినిమాల్లో నటించొద్ద‌ని పిటిషన్.. హైకోర్ట్ కీల‌క తీర్పు!

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) సినిమాల్లో న‌టించొద్ద‌ని ఓ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ ఏపీ హైకోర్ట్‌ (AP High Court)లో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. పిటిషన్ కొట్టివేస్తూ మాజీ ఐఏఎస్‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడంటూ స‌ద‌రు వ్య‌క్తి పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

డిప్యూటీ సీఎంగా పని చేస్తూ సినిమాలు చేయడం అనైతిక‌మ‌ని, మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక వాణిజ్య కార్యక్రమాలకు దూరంగా ఉండాల‌ని డిమాండ్ చేశారు. ఒకవైపు సినిమాలో నటించడం, మరోవైపు డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వహించడం పరస్పర విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును వివరించి, టికెట్ ధరల పెంపున‌కు పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) సంబంధం లేదని ఏపీ ప్రభుత్వ ఏజీ, అదనపు ఏజీ వాదనలు వినిపించారు. దీంతో పిటిషన్ కొట్టివేస్తూ తమ సమయం వృథా చేసిన పిటిషనర్‌కు భారీగా ఫైన్‌ విధించాల‌ని హైకోర్టు తీర్పునిచ్చింది.

Read Also: సరిహద్దుల ద్వారా ఆయుధాల స్మగ్లింగ్: నిందితుల అరెస్ట్

Follow Us On: Instagram

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>