epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

పర్సనల్ లోన్‌లో రిస్క్‌లు ఎక్కువ ఉన్నాయా.. ఇలా తగ్గించుకోండి..!

కలం డెస్క్: ఆర్థిక అవసరాల వల్ల మరోదారి ఏమీ తోచని పరిస్థితల్లో మనల్ని ఆదుకునేవే లోన్స్. కానీ ఇవి చాలా రిస్క్‌లతో వస్తాయి. చాలా మంది కొంచెం ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలంటే పర్సనల్ లోన్‌(Personal Loans) వైపు అడుగులు వేస్తారు. అది తీసుకునే సమయంలో అవసరాలు తీరిపోతున్నాయి కాబాట్టి చాలా బాగుంటుంది. ఆ తర్వాత కట్టేటప్పుడే అందులో ఉండే రిస్క్‌లు తెలిసి చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. లోన్ అంటే చాలా రిస్క్‌లు ఉంటాయి. కొందరికి ఇవి తెలియవు, మరి కొందరికి తెలిసినా అవసరాల వల్ల తీసుకుంటారు. మరి ఈ రిస్క్‌లను తగ్గించుకోవడానికి మార్గాలేమీ లేవా? అంటే అదేం కాదు.. కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. బ్యాంకుల్ని పోల్చి చూస్కోవాలి

లోన్‌లో వచ్చే అసలైన చిక్కు వడ్డీ. అదే మన లోన్‌లో సగం వరకు ఉంటుంది. అందుకే లోన్ తీసుకునే ముందు కనీసం 5–6 బ్యాంకులు / NBFCలు వడ్డీ రేట్లు పోల్చుకోండి. క్రెడిట్ స్కోర్ మంచి స్థాయిలో (750+) ఉంటే వ్యక్తిగతంగా బ్యాంక్‌ను సంప్రదిస్తే తక్కువ రేటు ఇవ్వడమూ సాధ్యం. ప్రీ–అప్రూవ్డ్ లోన్ ఆఫర్లను చూసి, అయితే రేట్లు ఎక్కువున్నాయో కూడా చెక్ చేయండి.

2. EMI మిస్ కాకుండా చూస్కోండి

లోన్(Personal Loans) తీసుకునే ముందు EMI మీ నెలజీతం 30% కంటే ఎక్కువ కాకుండా చూసుకోండి. మీ సేవింగ్స్ అకౌంట్‌లో ఆటో-డెబిట్ / ECS యాక్టివేట్ చేయండి. జీతం ఆలస్యమవుతుంటే EMI తేదీని బ్యాంక్‌ను అడిగి మార్చించుకోవచ్చు.

3. ప్రీ-క్లోజర్ ఛార్జీలను తెలుసుకోండి

లోన్ తీసుకునే ముందు ప్రీ-క్లోజర్ & పార్ట్-పేమెంట్ రూల్స్ స్పష్టంగా అడగండి. కొన్ని బ్యాంకుల్లో మొదటి సంవత్సరం తర్వాత పార్ట్-పేమెంట్ ఫ్రీగా అనుమతిస్తారు. అలాంటి వాటిని ప్రిఫర్ చేయండి. ఎక్కువ వడ్డీ చెల్లించకుండా ఉండాలంటే సాధారణంగా సంవత్సరం తర్వాత పార్ట్ పేమెంట్ చేయడం మంచిది.

4. అవసరం ఉంటేనే లోన్ తీస్కోవాలి

అత్యవసరం ఉన్నప్పుడు మాత్రమే లోన్ తీసుకోవాలి. ఇస్తానన్నారు కదా, వస్తుంది కదా అని తీసుకుంటే చిక్కులు తప్పవు. పర్సనల్ లోన్‌ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించండి. గాడ్జెట్లు కొనడం, ట్రావెల్ ప్లాన్స్, విలాసవంతమైన ఖర్చులకు ఇది సరైన ఆప్షన్ కాదు. ఖర్చులను ట్రాక్ చేసేందుకు UPI/బ్యాంకింగ్ యాప్స్ ఉపయోగించి నెలసరి బడ్జెట్ కంట్రోల్ చేయండి.

5. సేఫ్టీ నెట్ ఉంచుకోండి (లీగల్ ఇష్యూలను నివారించడానికి)

కనీసం 3–6 నెలల ఎమర్జెన్సీ ఫండ్ విడిగా ఉంచుకోండి. ఏదైనా నెలలో EMI చెల్లించలేనని ముందే తెలిసినా, వెంటనే బ్యాంక్‌ను సంప్రదించి “EMI డెఫరల్ / రీషెడ్యూలింగ్” ఆప్షన్ అడగండి. ఇలా ముందే చెప్పితే లీగల్ ఇష్యూలు, పెనాల్టీలు తప్పించుకోవచ్చు.

6. లోన్ అగ్రిమెంట్ పూర్తిగా చదవండి

చాలా మంది స్కిప్ చేస్తారు కానీ ఇది బాగా ముఖ్యం.
చూడాల్సిన పాయింట్లు:

వడ్డీ రేటు టైప్ (Fixed / Floating)

ప్రాసెసింగ్ ఫీ

లేట్ పేమెంట్ ఛార్జ్

ఫోర్‌క్లోజర్ నిబంధనలు

ఇన్సూరెన్స్ తీసుకోవాలా వద్దా

7. మీ క్రెడిట్ స్కోర్‌ను కాపాడుకోండి

క్రెడిట్ కార్డ్ బిల్స్ టైమ్‌కు చెల్లించండి. ఎక్కువసార్లు లోన్‌కు అప్లై చేయొద్దు. హార్డ్ ఇన్క్వైరీలు క్రెడిట్/సిబిల్ స్కోర్‌ను తగ్గిస్తాయి. ప్రతీ 6 నెలలకు ఒకసారి మీ CIBIL రిపోర్ట్ చెక్ చేయండి. వీటిని పాటించడం వల్ల కాస్తంత రిస్క్‌లను తగ్గించుకోవచ్చు. ఏదైనా మనకు అనువుగా లేదంటే.. వేరే మార్గం చూసుకోవచ్చు.

Read Also: శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్.. ఎలా? రిస్క్ ఏంటి?

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>