శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. ఎచ్చెర్ల మండలం జరజం (Jarajam) గ్రామ పరిధిలోని నేషనల్ హైవే–16 (NH16) పై ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో ఆటోలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్లు ఎగిరిపడ్డారు.

ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>