దంచిన దూబే .. న్యూజిలాండ్ టార్గెట్ 256!

కలం, స్పోర్ట్స్: టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో (T20 World Cup Final) టీమిండియా పరుగుల సునామీ సృష్టించింది. మధ్యలో వరుస వికెట్లు పడి కష్టాల్లో ఉన్న దశలో శివమ్ దూబే విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇప్పుడు కివీస్ ప్రపంచ విజేతగా నిలవాలంటే 256 పరుగులు చేయాల్సి ఉంది. చివరి ఓవర్లలో బ్యాటింగ్‌కు వచ్చిన శివమ్ దూబే కేవలం 8 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో 26 పరుగులు పిండుకున్నారు. ఆయన స్ట్రైక్ రేట్ 325గా నమోదు కావడం గమనార్హం. తిలక్ వర్మ (8*) తో కలిసి దూబే ఇన్నింగ్స్‌ను ఘనంగా ముగించారు. అంతకుముందు సంజూ శాంసన్ (89), ఇషాన్ కిషన్ (54), అభిషేక్ శర్మ (52) అర్ధ సెంచరీలతో కివీస్ బౌలర్లను చిత్తు చేశారు.

మధ్యలో జేమ్స్ నీషమ్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి భారత్‌ను దెబ్బతీశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగగా, హార్దిక్ పాండ్యా 18 పరుగుల వద్ద మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. అయితే ఈ ఒత్తిడిని అధిగమిస్తూ దూబే మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరును అందుకోగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ 3 వికెట్లు పడగొట్టగా, మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర చెరో వికెట్ సాధించారు. శాంట్నర్, ఫెర్గూసన్, డఫ్ఫీ వంటి ప్రధాన బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. భారత్ నిర్దేశించిన ఈ 256 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఎలా ఛేదిస్తుందో చూడాలి.

Read Also : విమెన్స్ డే స్పెషల్ : బ్రిలియంట్ ఆఫీసర్.. సైలెంట్ ఆపరేషన్

Follow Us On: Instagram

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>