Mobile Popup Ad
Mobile Popup Ad

టెన్త్ విద్యార్థి దాడి.. మతిస్థిమితం కోల్పోయిన టీచర్..

కలం, వెబ్ డెస్క్ : ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలో టీచర్ పై టెన్త్ క్లాస్ స్టూడెంట్ దాడి చేయడం ఎంత సంచలనం రేపిందో మనకు తెలిసిందే. ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జడ్పీ హైస్కూల్ లో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రవీంద్రపై టెన్త్ క్లాస్ స్టూడెంట్ పిడిగుద్దులతో దాడి చేశాడు. ఆ ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇద్దరు స్టూడెంట్లు గొడవ పడుతుంటే సముదాయించేందుకు ప్రయత్నించిన టీచర్ రవీంద్రపై టెన్త్ స్టూడెంట్ దాడి చేశాడు.

అయితే రవీంద్ర తాజాగా గన్నవరం (Gannavaram) రైల్వే ట్రాక్ వద్ద మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మతి స్థిమితం లేకుండా ఆయన అటు ఇటూ తిరుగుతూ తనలో తానే మాట్లాడుకుంటున్నారు. అయితే టెన్త్ స్టూడెంట్ కొట్టడంతోనే తీవ్ర మనస్థాపానికి గురైనట్టు కొందరు చెబుతున్నారు. టీచర్ ను గమనించిన స్థానికులు రవీంద్రను గన్నవరం పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>