కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో (Hormuz Strait) ఇరాన్ అమర్చిన సీ మైన్లను తొలగించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అండర్ వాటర్ డ్రోన్లు, ప్రత్యేక యంత్రాలతో ఇప్పటివరకు 10 వరకు మైన్లను బయటకు తీశారు. కొన్ని నెలల పాలు ఈ ప్రత్యేక ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. హర్మూజ్ జలసంధిలో నుంచి శత్రు నౌకలు రాకుండా నిరోధించేందుకు ఇరాన్ సీ మైన్లను అమర్చింది. ఇవి కొన్ని వందల సంఖ్యలో ఉండొచ్చని అమెరికా అంచనా వేస్తోంది. వీటిని అమర్చడం తేలికే అయినా, తొలగించడం మాత్రం చాలా కష్టసాధ్యమైన పనిగా నిపుణులు చెబుతున్నారు. నీటిలో ఉండటం వలన ఇవి అమర్చిన ప్రదేశం నుంచి మరో చోటకు కొట్టుకుని పోతుంటాయని.. తద్వారా తొలగింపు ప్రక్రియ మరింత ఆలస్యంగా జరుగుతుందని సమాచారం.
జలసంధి తెరవడంపై ఉత్కంఠ..
ఇరాన్, అమెరికా మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నా.. హర్మూజ్ జలసంధిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవల తమపై అగ్రరాజ్యం దాడులను నిరసిస్తూ టెహ్రాన్, మరోసారి మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. కేవలం మిత్ర దేశాల నౌకలు మాత్రమే వెళ్లేందుకు అనుమతించింది. చర్చలు కొలిక్కి వస్తేనే హర్మూజ్‌పై తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.

