కలం, వెబ్‌డెస్క్: మరో రెండు రోజుల్లో ఎన్నికలు. అయినా, బంగ్లాదేశ్ (Bangladesh) లో హిందువులపై హత్యాకాండ ఆగడం లేదు. గతేడాది నుంచి ఇప్పటివరకు అల్లరి మూకల చేతిలో హిందువులు పదుల సంఖ్యలో హత్యకు గురికాగా, మంగళవారం మరో వ్యక్తి ప్రాణాలు విడిచారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెమైన్సింగ్ జిల్లా సౌత్కాండ గ్రామానికి చెందిన సుశేన్ చంద్ర సర్కార్(62)కు త్రిషల్ ఉప జిల్లా బోగర్ బజార్లో ‘మెస్సర్స్ భాయ్ ఎంటర్ప్రైజెస్’ పేరుతో రైస్ ట్రేడింగ్ షాప్ నడుపుతున్నారు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి 11గంటల సమయంలో కొందరు దుండగులు కత్తులతో దుకాణంలోకి చొరబడ్డారు. సుశేన్పై (Sushen Chandra Sarkar) విచక్షణా రహితంగా దాడి చేశారు. కత్తులతో శరీరమంతా పొడిచారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అనంతరం దుండగులు షాప్ షట్టర్ మూసేసి పరారయ్యారు. మరుసటి రోజు స్థానికులు గమనించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, బంగ్లాదేశ్ (Bangladesh) లో మహ్మద్ యూనస్ నేతృత్వలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భారత వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థి నేత, ఇంక్విలాబ్ మోంచో నాయకుడు ఉస్మాన్ హాదీతో మైనారిటీలపై ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయి. ఓ ఫ్యాక్టరీలో పనిచేసే దీపూ చంద్ర దాస్‌ను కొట్టి, చెట్టుకు కట్టేసి తగలబెట్టడంతో మొదలైన ఈ దురాగతాలు ఇప్పటికీ ఆగడం లేదు.
Read Also: ఆంథ్రోపిక్ కీలక ఉద్యోగి రాజీనామా.. టెక్ వరల్డ్‌లో కలకలం
Follow Us On: Pinterest


