కలం, డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. ఈ రోజు ఉదయం నుంచే అల్లు అర్జున్ మీద రకరకాల వార్తలు, కథనాలు వస్తున్నాయి. అల్లు అర్జున్ (Allu Arjun) తన ప్రైవసీ కోసం రూల్స్ పెట్టుకున్నాడంటూ రకరకాల ట్రోల్స్ రావడంపై తాజాగా ఐకాన్ స్టార్ టీమ్ స్పందించింది. అల్లు అర్జున్ గురించి వస్తున్న వార్తలు అన్నీ ఫేక్ అని పేర్కొంది. బన్నీ ఎప్పుడూ గౌరవం, మర్యాదతోనే వ్యవహరిస్తారని.. ఎవరినీ ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదని చెప్పింది బన్నీ టీమ్. బన్నీపై తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై డిఫమేషన్ కేసులు పెడుతామని అల్లు అర్జున్ టీమ్ తెలిపింది.
అసలేం జరిగింది..?
బ్రాండ్ స్ట్రాటజర్ అయిన కావేరీ బారువా (Kaveri Baruva) రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొంది. ఆమె హీరోలు పెట్టే కండీషన్ల గురించి చెబుతూ అల్లు అర్జున్ గురించి మాట్లాడింది. ‘దక్షిణాది హీరోల్లో నేను ఒకసారి అల్లు అర్జున్ ను కలవడానికి వెళ్లాను. అప్పుడు నాకు 42 కండీషన్లు చెప్పారు ఆయన మేనేజర్లు. హీరోకు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దు, కళ్లలోకి చూడొద్దు. తగినంత దూరం పాటించాలి. హీరో సెట్ లో ఉన్నంత సేపు మొబైల్ వాడొద్దు అన్నారు. నేను అనుకోకుండా ఎక్కడో మూలన ఫోన్ పట్టుకుని కూర్చున్నా. వెంటనే అల్లు అర్జున్ బాడీగార్డు వచ్చి ఫోన్ లాగేసుకున్నాడు. బహుషా అది హీరో ప్రైవసీ కోసమే కావచ్చు’ అంటూ తెలిపింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో ట్రోల్స్ కు దారి తీసింది. అల్లు అర్జున్ కు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వొద్దా.. అతను కూడా మనిషే కదా అంటూ కొందరు పోస్టులు పెట్టారు. ఇంకొందరేమో బన్నీ ఇలాంటి రూల్స్ పెట్టుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. ఇలా రకరకాల వాదనలు వస్తున్న వేళ బన్నీ టీమ్ ఇలా రియాక్ట్ అయింది.
Read Also: డాన్ పాత్రలో బాలయ్య.. గోపీచంద్ మలినేని ప్లాన్ అదిరిందిగా
Follow Us On: Sharechat


