గుంటూరులో వైసీపీ ఆందోళ‌న‌తో హై టెన్ష‌న్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: గుంటూరు (Guntur)లో వైసీపీ నేత‌ల ఆందోళ‌న‌తో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతిలో ప్ర‌సార‌మైన ఓ క‌థ‌నంలో వైసీపీ నాయ‌కుల‌ను, మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచే విధంగా వ్యాఖ్య‌లు చేశార‌ని ఆరోపిస్తూ మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఆధ్వ‌ర్యంలో శంక‌ర్ విలాస్ వ‌ద్ద ఉన్న ఆంధ్ర‌జ్యోతి కార్యాల‌యం ముందు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో వైసీపీ నాయకులు, కార్య‌క‌ర్త‌లు, మ‌హిళ‌లు భారీ ఎత్తున పాల్గొన్నారు. నిర‌స‌న‌కారుల్ని చెద‌ర‌గొట్టేందుకు పోలీసులు తీవ్రంగా శ్ర‌మించారు. ముంద‌స్తుగా బారీకేడ్లు ఏర్పాటు చేసి ఎవ‌రూ ఆఫీస్‌ లోప‌లికి రాకుండా అడ్డుకున్నారు. ప‌రిస్థితి అదుపు త‌ప్ప‌డంతో ప‌లువురు వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పోలీసుల తీరుపై అంబ‌టి రాంబాబు (Ambati Rambabu) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గుంటూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రెండో రోజు ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి క్యార్యాల‌యాల ఎదుట వైసీపీ శ్రేణుల నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి.

Read Also: తెలంగాణ టూరిజం.. సమ్మర్ లో చుట్టేద్దాం

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>