కలం, వెబ్ డెస్క్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో వార్నర్‌కు మద్దతుగా క్రికెట్ ఎన్‌ఎస్‌డబ్ల్యూ (NSW) నిలిచింది. వార్న్‌ను కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేశారు పోలీసులు. అయితే, ఈ క్లిష్ట సమయంలో వార్నర్‌కు ఎన్‌ఎస్‌డబ్ల్యూ మద్దతు ప్రకటించడం చర్చనీయాంశమైంది. వార్నర్ చేసిన పనిని ఖండిస్తూనే, ఒక అసోసియేషన్‌గా అతనికి అండగా ఉంటామని క్రికెట్ ఎన్.ఎస్.డబ్ల్యూ స్పష్టం చేసింది. వార్నర్ అరెస్ట్ వార్తపై క్రికెట్ ఎన్.ఎస్.డబ్ల్యూ సీఈఓ లీ జెర్మన్ స్పందిస్తూ.. మద్యం తాగి వాహనం నడపడం తీవ్రమైన విషయమని పేర్కొన్నారు. సేఫ్ డ్రైవింగ్ విషయంలో తమ సంస్థ రాజీ పడదని, వార్నర్‌కు ఈ ఆరోపణల తీవ్రత అర్థమైందని ఆయన తెలిపారు. రాబోయే న్యాయ ప్రక్రియలో వార్నర్‌కు సహకరిస్తామని, అదే సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వార్నర్‌తో పాటు తోటి ఆటగాళ్లకు కూడా ప్రత్యేక అవగాహన కల్పిస్తామని జెర్మన్ వివరించారు.
పీఎస్ఎల్ మధ్యలోనే వచ్చేయాల్సిందేనా?
ప్రస్తుతం డేవిడ్ వార్నర్ (David Warner) పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026లో కరాచీ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. కెప్టెన్‌గా మూడు మ్యాచ్‌ల్లోనూ జట్టును గెలిపించిన వార్నర్, బ్యాటర్‌గానూ మంచి ఫామ్‌లో ఉన్నారు. సుమారు 140 స్ట్రైక్ రేట్‌తో రాణిస్తున్న ఆయన, లీగ్ మధ్యలోనే స్వదేశానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సి వస్తే, ఆయన పీఎస్ఎల్ టోర్నీకి దూరం కావచ్చని సమాచారం. ఈ వివాదంపై తదుపరి చట్టపరమైన పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
Read Also: నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా?
Follow Us On : WhatsApp

