బిగ్‌బాస్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్విస్ట్: కంటెస్టెంట్ కీలక నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 (Bigg Boss Telugu)లో ఆసక్తికరంగా నడుస్తోంది. మూడో వారంలో ‘టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్’ కాన్సెప్ట్‌లో భాగంగా బిగ్‌బాస్ ఊహించని పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. హౌస్‌లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే బిగ్‌బాస్ చరిత్రలోనే నిలిచిపోయేలా ఓ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

ఇటీవలే ‘అగ్నిపరీక్ష’ ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, టాస్కులో గెలిచి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు మిథిలేష్ (Mithilesh). అయితే శనివారం నాటి ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్ల ముందు రూ.5 లక్షలతో ఉన్న సూట్‌కేస్‌ను ఉంచి ఆఫర్ ప్రకటించారు. తొలుత ఈ ఆఫర్‌ను తీసుకోవడానికి హౌస్‌మేట్స్ ఎవరూ ముందుకు రాలేదు. తమకు టైటిల్ ముఖ్యం అని తేల్చి చెప్పారు.

కానీ ఆఫర్‌ను రూ.10 లక్షల నుంచి ఏకంగా రూ.15 లక్షలకు పెంచడంతో ఆట స్వరూపమే మారిపోయింది. హౌస్‌లో కేవలం రెండు రోజులు మాత్రమే గడిపిన మిథిలేష్ అనూహ్యంగా ముందుకు వచ్చి ఆ ఆఫర్‌ను స్వీకరించడానికి సిద్ధపడ్డాడు. హౌస్‌లో ఉంటే వారానికి దాదాపు రూ.75 వేల పారితోషికం లభిస్తుందనే ప్రచారం ఉన్నప్పటికీ, మిథిలేష్ మాత్రం రూ.15 లక్షల డబ్బును ఎంచుకుని షో నుంచి తప్పుకోవడానికే మొగ్గు చూపాడు.

ఈ మొత్తం విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుందని నాగార్జున చెప్పడంతో హౌస్‌మేట్స్ ఆందోళనకు గురయ్యారు. మిథిలేష్‌ను తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మిగతా సభ్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, అతను తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. తన కుటుంబానికి ఈ డబ్బు చాలా అవసరమని మిథిలేష్ తెలపడంతో, హౌస్‌మేట్స్ మెజారిటీ ఓటింగ్ ద్వారా అతను డబ్బుతో బయటకు వెళ్లేందుకు సమ్మతించారు. దీంతో బిగ్‌బాస్ చరిత్రలోనే తక్కువ సమయంలో, భారీ మొత్తంతో బయటకు వచ్చిన మొదటి కంటెస్టెంట్‌గా మిథిలేష్ రికార్డు నెలకొల్పాడు.

Also Read : ‘ధోనీ టీమ్ కంటే గిల్ జట్టులోనే ఎక్కువ సత్తా’

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>