మొంథా తుఫాను(Cyclone Montha) ప్రభావం కోస్తా ప్రాంత జిల్లాలపై ఇంకా ఉండనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్రతుపాన్‌గా మారిందని చెప్పారు. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదిలిందని, ప్రస్తుతానికి మచిలీపట్నంకి 120 కిమీ, కాకినాడకి 200 కిమీ, విశాఖపట్నంకి 290 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు. మంగళవారం రాత్రికి కాకినాడ- మచిలీపట్నం మధ్య తీవ్రతుపానుగా తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. దగ్గరకు వచ్చే కొద్దీ ప్రభావం పెరిగే అవకాశం ఉందని, తద్వారా కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవచ్చని వివరించారు. తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.
Read Also: కోనసీమలో ‘మొంథా’ బీభత్సం..

