కలం, వెబ్ డెస్క్ : ఎడారి దేశం సౌదీ అరేబియాలో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సౌదీ రాజధాని రియాద్‌లో వరదలు (Saudi Floods) సంభవిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పుల కారణంగా ఎడారి దేశాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రియాద్ తో పాటు కీలక ప్రావిన్సుల్లో వరదల ((Saudi Floods)) తో జనజీవనం స్థంభించిపోయింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్కూల్లకు, కాళేజీలకు సేలవులు ప్రకటించింది. అలాగే, అత్యవసర సేవల విభాగాలను అప్రమత్తం చేసి అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
రియాద్‌లో కురిసిన వర్షాలతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వర్షాలతో పాటు గాలి వీయడంతో దూళి తుఫానులు వస్తున్నాయి. దీంతో వాహనదారులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సౌదీ అరేబియా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

