Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్ఆర్ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లో సరికొత్త రికార్డ్‌లు !

కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌ (SRH vs RR) లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అరంగేట్ర బౌలర్ ప్రఫుల్ హింజ్ రికార్డు స్థాయి స్పెల్ ఈ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో కొన్ని అరుదైన రికార్డులు నమోదయ్యాయి. ప్రఫుల్ హింజ్ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. నాలుగో వికెట్ పడే సమయానికి 2 పరుగులు మాత్రమే ఉండటం ఐపీఎల్ చరిత్రలో సంయుక్త కనిష్ట స్కోరుగా నమోదైంది.

అభిషేక్ శర్మ ఒకే సంవత్సరంలో అత్యధిక డక్స్ సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్‌లో మొదటి బంతికి వికెట్ కోల్పోయిన సందర్భాల్లో రాజస్థాన్ రాయల్స్ సంఖ్య 12కి చేరింది. ఇషాన్ కిషన్ 91 పరుగులు కెప్టెన్‌గా రాజస్థాన్‌పై రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచాయి. మొత్తంగా ఈ మ్యాచ్‌ (SRH vs RR)లో యువ ఆటగాళ్ల ప్రదర్శనతో హైదరాబాద్ జట్టు ఆధిపత్యం చాటగా, రాజస్థాన్ జట్టుకు ఇది టోర్నీలో తొలి ఎదురుదెబ్బగా మారింది. రాబోయే మ్యాచ్‌లలో రెండు జట్లు ఎలా పుంజుకుంటాయో చూడాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>