కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు కురిసిన వర్షం తో కరీంనగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా కలెక్టరేట్, మంచిర్యాల చౌరస్తా, విద్యానగర్ జ్యోతి నగర్ పాటు వివిధ కాలనీలు మట్టి రోడ్లు అధ్వానంగా మారిపోయాయి. ఈదురు గాలిలతో కూడిన వర్షంతో పలుచోట్ల చెట్లు కూలిపోయాయి.

