కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. ముఖ్యంగా కొండాపూర్ మండలంలో కేవలం గంటన్నర వ్యవధిలోనే 8.1 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. సదాశివ పేటలో ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడటంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మరోవైపు తెల్లాపూర్‌లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. విలాసవంతమైన గెటెడ్ కమ్యూనిటీ విల్లాలోకి వరద నీరు పోటెత్తింది . డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బలమైన గాలుల కారణంగా జిల్లాలోని చెట్లు విరిగిపడటంతో పాటు, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.
Read Also: నా సోదరుడు గుర్తొచ్చాడు.. డీజీపీ సీవీ ఆనంద్ భావోద్వేగం
Follow Us On: Sharechat

