కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కార్యక్రమంలో డీజీపీ సీవీ.ఆనంద్ (DGP CV Anand) పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సోదరుడిని గుర్తు చేసుకుని భావోద్వేగం చెందారు. ‘1979లో నేను 11 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ పైలట్ల పరేడ్ కార్యక్రమానికి తల్లిదండ్రులతో కలిసి వెళ్లాను. నా సోదరుడు చామ వినోద్ కుమార్ కూడా ఆ బ్యాచ్‌లో ఉన్నారు. 1983 నవంబరులో జరిగిన మిగ్ 21 విమాన ప్రమాదంలో ఆయన కన్నుమూశారు.
47 ఏళ్ల తరువాత ఈ రోజు అకాడమీకి వెళ్లినప్పుడు ఆయన (DGP CV Anand) గుర్తొచ్చి కళ్లు చెమర్చాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించడం, మార్చ్ ఫాస్ట్, హెలికాప్టర్ల అబ్బురపరిచే విన్యాసాలు చూడటం అద్భుతంగా అనిపించింది. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ.సింగ్, మాజీ వైమానిక దళాధిపతి వివేక్ చౌదరి, బ్రౌనేను కలవడం ఆనందంగా ఉంది’ అని అందుకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు.
Read Also: రోడ్డుపై వరద.. కలెక్టర్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్
Follow Us On: Instagram

