రేపు హైద‌రాబాద్‌కు కాక్రోచ్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు..!

క‌లం, వెబ్ డెస్క్: నీట్ పేప‌ర్ లీక్‌, విద్యా వ్య‌వ‌స్థ‌లో లోపాల‌కు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జ‌నతా పార్టీ (Cockroach Janta Party) దేశ వ్యాప్త ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జూన్ 14న ఆదివారం కాక్రోచ్ పార్టీ వ్య‌వస్థాప‌కుడు అభిజీత్ డిప్కే (Abhijeet Dipke) హైద‌రాబాద్‌కు రానున్నారు. ఈ నిర‌స‌న‌ల‌పై పార్టీ కొద్ది రోజుల కింద‌నే అధికారిక ఇన్‌స్టా ఖాతాలో షెడ్యూల్ విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం జూన్ 11 నుండి జూన్ 20 వరకు దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో నిర‌స‌న‌లు ప్ర‌క‌టించింది.

ఇందులో భాగంగా రేపు ఉద‌యం 10 గంటల నుండి హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం జరగనుంది. దేశవ్యాప్తంగా సీజేపీ శాంతియుత నిరసనలు జరుగుతున్నాయ‌ని, మీ నగరంలో జరిగే పోరాటంలో భాగస్వాములు కావాలంటూ పార్టీ ప్రజలను కోరింది. ప్ర‌స్తుతం అమృత్‌స‌ర్‌లో (Amritsar) నిర‌స‌న గ‌ళం వినిపిస్తున్న అభిజీత్ డిప్కే (Abhijeet Dipke) రేపు ఉద‌యం హైద‌రాబాద్‌లో త‌న కార్య‌క్ర‌మాన్ని ముగించుకొని సాయంత్ర నాలుగు గంట‌ల‌కు బెంగ‌ళూరులో నిస‌స‌న చేప‌ట్ట‌నున్నారు. ఈనెల‌ 15న జైపూర్‌, 20న ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిర‌స‌న‌లు కొన‌సాగ‌నున్నాయి.

Read Also: నా సోదరుడు గుర్తొచ్చాడు.. డీజీపీ సీవీ ఆనంద్ భావోద్వేగం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>