బీసీ రిజర్వేషన్ల(BC Reservations) జీఓపై విచారణు హైకోర్టు గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ఇరు వర్గాల వాదనలను విన్న అనంతరం మరిన్న అంశాలను విచారించాల్సి ఉన్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. విచారణ గురువారం మధ్యాహ్నం 2:15 గంటలకు తిరిగి ప్రారంభం అవుతుందని న్యాయస్థానం పేర్కొంది. అయితే బుధవారం జరిగిన విచారణలో ప్రభుత్వంపై న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది.
అసలు బిల్లు గవర్నర్ దగ్గర ఎంతకాలంగా పెండింగ్‌లో ఉంది? రిజర్వేషన్ల(BC Reservations) ప్రక్రియ ఎలా నిర్వహించారు? కమిషన్ రిపోర్ట్ పబ్లికేషన్ చేశారా? ప్రజల అభ్యంతరాలను స్వీకరించారా? అంటూ వరుస ప్రశ్నలు లేవనెత్తింది న్యాయస్థానం. షెడ్యూల్ నోటిఫై అయిందా? అని కూడా ఏజీని ప్రశ్నించింది. వాదనలు ఇంకా వినిపించాల్సి ఉండటంతో విచారణను రేపటికి వాయిదా వేయాలని ఏజీ కోరారు. అయితే ఇంతలో నామినేషన్లు వేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. అందుకు న్యాయస్థానం నిరాకరించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.

