Mobile Popup Ad
Mobile Popup Ad

నిజామాబాద్‌లో విషాదం.. ఆన్ డ్యూటీలో హెడ్ కానిస్టేబుల్ మృతి

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్(Nizamabad) జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మోపాల్ పోలీస్ స్టేషన్‌లో(Mopal Police Station) విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌కు ఆన్ డ్యూటీలోనే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. సోమవారం విధులలో ఉన్న సమయంలో గంగాధర్‌కు ఒక్కసారిగా తీవ్ర ఛాతి నొప్పి రావడంతో సహచర సిబ్బంది వెంటనే స్పందించారు.

ఎస్సైతో పాటు ఇతర పోలీసులు ఆయనను హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. హెడ్ కానిస్టేబుల్ మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆన్ డ్యూటీలో చనిపోవడంతో పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>