ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం స్పష్టత!

కలం, వెబ్ డెస్క్: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయబోరని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అలా చేయడమంటే, బాధ్యతల నుంచి తప్పించుకోవడమే అని పేర్కొంటున్నాయి.

కేంద్ర మంత్రి రాజీనామా చేయడం వలన సమస్యకు తక్షణ పరిష్కారం లభించదని.. నీట్ పరీక్షను ఇక నుంచి మరింత సమర్థవంతంగా ఎలా నిర్వహించాలనే దానిపై ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం చేశాయి.

రేపటి నిర్ణయంపై ఉత్కంఠ..

కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఈ రోజు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తరువాతనే మాట్లాడుతామని వారు తెగేసి చెప్పారు. రేపు మధ్యాహ్నం వరకు సమయం తీసుకుంటామని కేంద్ర మంత్రులు తెలిపారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోరని ప్రభుత్వ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో.. రేపు ఎలాంటి నిర్ణయం ప్రకటించబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. దానిపై కాక్రోచ్ జనతా పార్టీ ఎలా స్పందించనుందనేది కూడా ఆసక్తికరంగా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>