Mobile Popup Ad
Mobile Popup Ad

బావిలో పడ్డ హార్వెస్టర్.. డ్రైవర్ మృతి!

​కలం, కరీంనగర్ బ్యూరో: వరి కోత మిషన్ (Harvester) ప్రమాదవశాత్తు బావిలో పడడంతో డ్రైవర్ మరణించిన విషాద సంఘటన జగిత్యాల (Jagtial) జిల్లా పెగడపల్లి మండలం నందగిరి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వరి కోత మిషన్ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడటంతో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. పాలకళ్ల మధు (30 ) ​పొలంలో వరి కోస్తుండగా, హార్వెస్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. యంత్రంతో సహా బావిలో పడిపోవడంతో మధు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘ‌ట‌న‌పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>