రహీంఖాన్‌పేటలో అలయన్స్ క్లబ్ ప్రారంభం

కలం, కరీంనగర్ బ్యూరో : అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్, డిస్ట్రిక్ట్ 137A ఆధ్వర్యంలో అలయన్స్ క్లబ్ ఆఫ్ రహీంఖాన్ పేట ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు, కార్యదర్శి, ఖజాంచి సభ్యులను అభినందించారు. వారికి అలయన్స్ క్లబ్ విధి విధానాలపై అవగాహన కల్పించి, అధ్యక్షుడు, కార్యదర్శి, ఖజాంచికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తదుపరి, క్లబ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇల్లంతకుంట (Ellanthakunta) మండల హెడ్ క్వార్టర్స్ సమీపంలో ఉన్న చిన్న గ్రామపంచాయతీ నుండి అలయన్స్ క్లబ్ ప్రారంభించడం ఎంతో గొప్ప విషయమని ప్రశంసించారు.

2026–27 సంవత్సరానికి సంబంధించిన అలయన్స్ క్లబ్ ప్రమాణ స్వీకారోత్సవం 24న సాయంత్రం 5:00 గంటలకు ఐఎంఏ హాల్‌లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ నేతలు ఇంజనీర్ కోల అన్నా రెడ్డి, జిల్లా గవర్నర్ కొంజర్ల మహేష్, సుద్దపెల్లి ప్రసాద్, విద్యాసాగర్ రెడ్డి, పుల్లాల శ్యామ్, మాధవరావు, నాగేశ్వర్, కుమారస్వామి, ఆచీవర్స్ వెంకటేశ్వర్లు, గడ్డమీద శ్రీనివాస్, ఉటకం రాజేందర్, దొంతి అశోక్, కమటం పరుశురాం, దొంతి కిరణ్, ఏనుగుల హరికృష్ణ, గడ్డమీది మహేష్, గడ్డమీది ప్రశాంత్, బత్తిని అరుణ్ రవి, కొమిరే అజయ్, పెద్ది మారుతి, పొన్నగంటి వెంకటేశం, దొంతి రవీందర్, రాగుల నరేష్ ఇతరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>