విద్యారంగ సేవకులకు గురుశ్రేష్ఠ పురస్కారాలు

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం (TRSMA) ఆధ్వర్యంలో నిర్వహించనున్న గురుశ్రేష్ఠ – ప్రైవేట్ టీచర్స్ అవార్డుల(Gurushreshta Awards) ప్రదానోత్సవానికి హాజరుకావాలని కోరుతూ అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్‌లను ట్రస్మా ప్రతినిధులు బుధవారం కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 14న ఉదయం 10 గంటలకు నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ సమీపంలో ఉన్న ఆర్కే కన్వెన్షన్ హాల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యారంగంలో విశేష సేవలందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులను గుర్తించి గురుశ్రేష్ఠ అవార్డులతో సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు అయ్యన్నగారి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి శ్యాంప్రకాష్, రాష్ట్ర ఈసీ సభ్యులు షబ్బీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>