కలం, నిర్మల్: బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) గురువారం నిర్మల్ (Nirmal) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సారంగాపూర్ మండలం ఆలూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 11 గంటలకు సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు, మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ పెన్షనర్ల సంఘం భవనంలో నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సోన్ మండల కేంద్రంలోని రైతు వేదికలో, సాయంత్రం 4 గంటలకు లక్ష్మణచందా మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆయా మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేయనున్నారు.
Also Read : 1968లో రాజీవ్‌తో పెళ్లి.. పౌరసత్వంపై 15 ఏళ్ల నిరీక్షణ ఎందుకు? : కంగనా
Follow Us On : WhatsApp

