కలం, వెబ్ డెస్క్: జనసేన పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ (Harsha Veena) ఈరోజు రైల్వేకోడూరు టీడీపీ (TDP) ఆఫీసుకు రావడం హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న ప్రజా దర్బార్‌కు హర్షవీణ హాజరైంది. రైల్వేకోడూరు టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానందరెడ్డిని హర్షవీణ కలిసింది. అరవ శ్రీధర్ వ్యవహారంలో తనకు సహకరించాలని కోరింది. ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని కూడ అందజేసింది. ఇప్పటి వరకు అరవ శ్రీధర్ వ్యవహారంలో జరిగిన అంశాలను రూపానందరెడ్డికి వివరించింది. అరవ శ్రీధర్‌పై కొత్త కేసు నమోదు చేస్తున్నానని, ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నానని తెలిపింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వకుండానే అరవ శ్రీధర్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించింది. ఇన్ని రోజులైనా న్యాయం జరగకపోవడం తనకే అవమానకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.

