epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సారీ చెప్పిన బ్రూక్.. ఆ ఇన్సిడెంట్ వల్లే!

క‌లం వెబ్ డెస్క్‌ : ఇంగ్లాండ్(England) టెస్ట్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్(Harry Brook) బహిరంగ క్షమాపణ కోరాడు. న్యూజిలాండ్ టూర్(New Zealand Tour) సమయంలో నైట్‌క్లబ్(Nightclub) దగ్గర బౌన్సర్‌తో జరిగిన చిన్న ఘర్షణపై బ్రూక్ తాజాగా స్పందించాడు. ఈ ఘటన మూడో వన్డేకు ముందు వెల్లింగ్టన్‌లో జరిగింది. మద్యం మోతాదు ఎక్కువగా ఉన్నాడన్న అనుమానంతో క్లబ్‌లోకి అనుమతించకపోవడంతో గొడవ మొదలైంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

ఈ వ్యవహారాన్ని హ్యారీ బ్రూక్(Harry Brook) స్వయంగా జట్టు భద్రతా విభాగానికి తెలియజేశారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆయనపై ముప్పై వేల పౌండ్ల జరిమానా విధించింది. తన ప్రకటనలో బ్రూక్, “నా ప్రవర్తన తప్పు. జట్టును అభిమానులను నిరాశపరిచాను. ఇంగ్లాండ్ తరపున ఆడటం నాకు గొప్ప గౌరవం. బాధ్యత వృత్తిపరమైన నిబద్ధత గురించి ఈ ఘటన విలువైన పాఠం నేర్పింది” అన్నారు. ఈ ఘటనను రహస్య శిక్షా ప్రక్రియలోనే పరిష్కరించినట్టు క్రికెట్ బోర్డు వెల్లడించింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>