రేవంత్ సర్కార్ మూమ్మాటికి రైతు హంతక ప్రభుత్వమే : హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్ తీరు వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. యూరియా స్టాక్ ఉన్నా అమ్మకాలు నిలిపివేయడం దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ మూమ్మాటికి రైతు హంతక ప్రభుత్వమేనని ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదన్న హరీశ్ రావు.. ధాన్యం కొనుగోళ్లు కూడా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని ఆగ్రహం వ్యక్తం చేశారు . ఒకవైపు అమ్మకాల నిలిపివేత, మరోవైపు అడ్డగోలుగా ఎరువుల ధరలు పెరగడంతో రైతులు అరిగోస పడుతున్నారని తెలిపారు. రైతులు అరిగోస పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని వారోత్సవాలు జరుపుతుందని ప్రశ్నించారు. అలాగే యూరియా అమ్మకాలపై అనధికార బ్యాన్ ఎందుకు పెట్టారో చెప్పాలని నిలదీశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>