Mobile Popup Ad
Mobile Popup Ad

ఢిల్లీకి నజరానా.. రైతులకు జరిమానా అన్నట్లు రేవంత్ పాలన: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) పరిశీలించారు. వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తూకంలో జాప్యం, తరుగు పేరుతో జరుగుతున్న మోసాలపై రైతుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలకు కల్లాల్లోనే తడిసిన వడ్ల కుప్పలను హరీశ్ రావు పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వ తీరును ఆయన నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెడుతోందని.. పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు కానీ ఒక్క గింజ కూడా ప్రభుత్వం కొనడం లేదన్నారు. మొక్కజొన్న రైతులకు గన్నీ బ్యాగులు లేకపోతే రైతులు సొంతంగా బ్యాగులు తెచ్చుకుంటున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంటే.. ఢిల్లీకి నజరానా, రైతులకేమో జరిమానా అన్నట్టుగా తయారైందని విమర్శించారు. 69 సార్లు ఢిల్లీకి పోయి కప్పం కట్టే బదులు రైతులను పట్టించుకోండి అంటూ మండిపడ్డారు. తరుగు పెడితే తోలు తీస్తా అన్న సీఎం.. ఇప్పుడు ఎవరి తోలు తీస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>