Mobile Popup Ad
Mobile Popup Ad

అందుకే రేవంత్ రెడ్డి మెదక్ రాలేదు: హరీశ్ రావు

కలం, మెదక్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ప్రచారం చివరిదశకు చేరుకున్నది. సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగియనున్నది. దీంతో నేతలు విమర్శలకు పదునుపెట్టారు. ఒకరిమీద మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) .. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని జిల్లాలు తిరిగిన రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో మాత్రం పర్యటించలేదని చెప్పారు.

మెదక్ (Medak) జిల్లాలో ఓడిపోతామని తెలిసే సీఎం రేవంత్ రెడ్డి ఈ జిల్లాకు రావడం లేదని విమర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదని హరీశ్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో (Dubbaka Municipality) స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు (Harish Rao) మాట్లాడుతూ..రేవంత్ రెడ్డికి ఉమ్మడి మెదక్‌కు వచ్చేందుకు ముఖం లేదని, ఓట్ల కోసం ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు గారడీలపై మెదక్ ప్రజలు నిలదీస్తారని ఇటు వైపు చూడటం లేదు. ‘ఉమ్మడి జిల్లాలో ప్రచారానికి రావాలని ఇక్కడి నేతలు పిలుస్తున్నారట.. కానీ ముఖ్యమంత్రి మాత్రం రావడం లేదు’ అంటూ హరీశ్ రావు విమర్శించారు.

 Read Also: పేదోళ్లంద‌రికీ రేష‌న్ కార్డులు అందించాం: టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ గౌడ్‌

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>